తీస్‌మార్‌ఖాన్: త్రీ షేడ్స్‌లో కనిపించనున్న ఆది సాయి కుమార్..!

Published on Dec 24, 2021 2:01 am IST


యంగ్ హీరో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం “తీస్ మార్ ఖాన్. ఈ హై యాక్షన్ వోల్టేజ్ చిత్రాన్ని విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తుండగా, కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు దర్శకనిర్మాతలు. ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఈ క్రమంలో తాజాగా ఈ రోజు ప్రముఖ హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా ‘తీస్ మార్ ఖాన్’ గ్లాన్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర సక్సెస్ కోరుకుంటూ చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు సందీప్ కిషన్. ఇక ఈ వీడియోలో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌లో కనిపించారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. స్టూడెంట్‌గా, రౌడీగా, పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ త్రీ షేడ్స్‌లో అదరగొట్టనున్నారని తెలుస్తోంది. ఈ గ్లాన్స్ వీడియో ద్వారా సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

గ్లాన్స్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :