టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ఆది సాయి కుమార్ “అతిధి దేవోభవ”

Published on Dec 20, 2021 10:00 pm IST


ఆది సాయికుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్ గా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అతిథి దేవోభవ. ఈ చిత్రాన్ని శ్రీనివాస సినీ క్రియేషన్స్ పతాకంపై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ప్రకటన దగ్గర నుండి సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం టీజర్ ను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :