డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన “సిఎస్ఐ సనాతన్”

డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన “సిఎస్ఐ సనాతన్”

Published on May 10, 2023 1:30 PM IST

యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా శివశంకర్ దేవ్ దర్శకత్వం వహించిన సిఎస్ఐ సనాతన్ చిత్రం మళ్లీ వార్తల్లో నిలిచింది. మార్చి 2023లో విడుదలైన ఈ సినిమాలో నందిని రాయ్ కథానాయికగా నటించింది. తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా, మేకర్స్ సైలెంట్‌గా సినిమాను ఓటిటి లో విడుదల చేశారు.

థియేటర్లలో సినిమా మిస్ అయిన వారు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ చిత్రాన్ని చూడవచ్చు. తారక్ పొన్నప్ప, వాసంతి, సంజయ్ రెడ్డి, మధుసూధన్ రావు, అలీ రెజా, ఖయ్యూమ్, శివ కార్తీక్ తదితరులు ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషించారు. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై అజయ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనీష్ సోలమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు