ఆదితో ఆదా శర్మ రొమాన్స్.

Aadi--Adah-Sharma
‘గాలిపటం’ సినిమాతో సక్సెస్ కొట్టిన యంగ్ హీరో ఆది… తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. ‘ఆ నలుగురు’ స్క్రిప్ట్ రైటర్, ‘పెళ్ళైన కొత్తలో’ సినిమా దర్శకుడు మదన్ దర్శకత్వంలో ఆది నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో యంగ్ & ఎనర్జిటిక్ పాత్రలో ఆది కనిపిస్తాడు. ప్రెజెంట్ జనరేషన్ & యూత్ ను రిప్రజెంట్ చేసే రోల్ లో ఆది నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేస్తున్నాడని దర్శకుడు తెలిపారు.

ఈ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో ఆదితో ‘హార్ట్ ఎటాక్’ భామ ఆదా శర్మ రొమాన్స్ చేయనుంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేద్దామని ఆడిషన్స్ నిర్వహించారు. సుమారు 30 మంది కొత్త అమ్మాయిలను ఆడిషన్స్ చేసినా ఎవరు దర్శకుడిని ఇంప్రెస్స్ చేయలేకపోయారు. హిందీ సినిమా ‘హసీ తో ఫసీ’తో ఆదా శర్మ యాక్టింగ్ & గ్లామర్ పెర్ఫార్మన్స్ చూసి ఫిదా అయిన మదన్ వెంటనే హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇటివలే హీరో హీరోయిన్లపై ఫోటో షూట్ కూడా చేశారని సమాచారం.

‘హార్ట్ ఎటాక్’ సినిమా తర్వాత ఆదా శర్మ తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. పూరి దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’లో ఆదా నటనకు, అందానికి మంచి మార్కులే పడ్డాయి.

Exit mobile version