ఆది కొత్త సినిమా ట్రైలర్ రేపే !


ఇటీవలే ‘శమంతకమణి’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన యువహీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం ‘నెక్స్ట్ నువ్వే’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళ హిట్ మూవీ ‘యామిరుక్క భయమే’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం యొక్క ట్రైలర్ రేపు ఉదయం రిలీజ్ కానుంది.

ఈ చిత్రాన్ని బుల్లి తెర నటుడు, యాంకర్ ఈటీవీ ప్రభాకర్ డైరెక్ట్ చేస్తుండగా ఇందులో వైభవి శాండిల్య హీరోయిన్ గాను, రష్మీ గౌతం ఒక ప్రధాన పాత్రలోనూ నటిస్తోంది. గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతున్న హార్రర్ కామెడీ జానర్లో ఈ సినిమా ఉండనుంది.