త్వరలో ‘ఆగడు’ టీం ఇంటర్వ్యూ

Aagadu_team

సూపర్ స్టార్ మహేష్ బాబు, తమన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన చిత్రం ‘ఆగడు’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఎదురులేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో మహేష్ బాబు ఒదిగిపోయిన తీరు అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. మహేష్ బాబు కామెడీ టైమింగ్, నటనకు అద్బుత స్పందన లభించింది. ఈ సినిమా ప్రతి ఏరియాలో రికార్డు కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది.

విడుదలకు ముందు ‘ఆగడు’ నిర్మాతలు సరికొత్త తరహా పబ్లిసిటీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా విజయం సాధించడంతో నిర్మాతలు పబ్లిసిటీని మరింత పెంచారు. న్యూస్ చానల్స్, టీవీలలో ట్రైలర్స్ ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ నగరాలలో అభిమానులతో ర్యాలి నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. త్వరలో దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాతల ప్రత్యేక ఇంటర్వ్యూలను ఇవ్వనున్నారు.

Exit mobile version