పొన్నియిన్ సెల్వన్2 నుండి ఆగనందే గ్లింప్స్ రిలీజ్!

Published on Mar 19, 2023 9:18 pm IST


స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా పొన్నియిన్ సెల్వన్2. పొన్నియిన్ సెల్వన్ కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ను ఏప్రిల్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ ను షురూ చేశారు.

ఈ చిత్రం లోని ఆగనందే సాంగ్ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ను మేకర్స్ నేడు విడుదల చేశారు. హీరో కార్తీ మరియు త్రిష ల మధ్యన ఈ సాంగ్ ఉండనుంది. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ పతాకాల పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, జయరామ్, శోభిత ధూళిపాళ, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :