థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిన ఆకాష్ పూరీ “చోర్ బజార్”

Published on Jun 13, 2022 3:14 pm IST


ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా చోర్ బజార్. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్
పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న చోర్ బజార్ సినిమా ట్రైలర్ ఇటీవల బాలకృష్ణ చేతులమీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

చోర్ బజార్ సినిమా పాటలు హిట్ అవ్వడం మాత్రమే కాకుండా, ట్రైలర్ కు మంచి టాక్ వచ్చింది. ఇవన్నీ సినిమా మీద పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. బిజినెస్ సర్కిల్స్ లో క్రేజ్ ఏర్పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండటం మూవీ స్థాయిని మరింత పెంచిందని చెప్పుకోవచ్చు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ జగదీష్ చీకటి, సంగీతం సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ అన్వర్ అలీ, ఆర్ట్ గాంధీ నడికుడికర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రియదర్శన్ బాల సుబ్రహ్మణ్యం, సౌండ్ డిజైనర్ సాయి మనీందర్ రెడ్డి, ఆడియో లహరి, కాస్ట్యూమ్స్ డిజైనర్ ప్రసన్న దంతులూరి ఫైట్స్ ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ భాను,పబ్లిసిటీ డిజైనర్ అనిల్ భాను, స్టిల్స్ వికాస్ సీగు, పి.ఆర్.వో జీఎస్కే మీడియా, మేకప్ శివ,
కాస్ట్యూమ్ చీఫ్ లోకేష్, డిజిటల్ మీడియా వాల్స్ అండ్ ట్రెండ్స్, సహ నిర్మాత అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం బి. జీవన్ రెడ్డి లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :