ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన “ఆకాశవాణి” ట్రైలర్..!

Published on Sep 20, 2021 10:54 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో పద్మనాభరెడ్డి నిర్మాణంలో రూపుదిద్దుకున్న చిత్రం “ఆకాశవాణి”. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ అద్భుతమైన మ్యూజిక్, విజువల్స్‌తో ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉందని, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

ఇక ట్రైలర్‌ని చూస్తుంటే అడవి ప్రాంతంలోని గిరిజన గూడెం చుట్టూ ఈ కథ అల్లుకుని ఉన్నట్టు కనిపిస్తుంది. ఓ దొర గూడెం వాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి జీవితాలను శాసిస్తుంటాడు. ఎవరైనా ఎదురు చెబితే చిత్ర హింసలకు గురిచేయడం, చంపేయడం వంటివి చేస్తుంటాడు. అలాంటి సమయంలో ఆ గూడెం ప్రజలకు ఒక వ్యక్తి రేడియోను అందిస్తాడు. ఆ రేడియో వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేదే అసలు కథలా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో సముద్రఖని, వినయ్ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సోని లివ్ లో సెప్టెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :