చైతుతో కలిసి మొక్కలు నాటిన అమీర్ ఖాన్ !

Published on Sep 19, 2021 6:11 pm IST

అక్కినేని నాగ చైతన్య – బాలీవుడ్‌ స్టార్ హీరో ఆమీర్‌ ఖాన్‌ కలిసి నేడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పై విస్తృతంగా ప్రచారం కలిపిస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ జె నేతృత్వంలో చైతు – అమీర్ కలిసి బేగంపేట విమానాశ్రయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం పై విస్తృతంగా ప్రచారం కలిపిస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ జె నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇంకా కొనసాగడం గొప్ప పరిణామం.

ఇక నాగ చైతన్య బాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా రానున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో చైతు నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర 18 నిమిషాల పాటు ఉంటుందని.. ఒక తెలుగు కుర్రాడి పాత్రలో చైతు కనిపించబోతున్నాడని.. సినిమాలో చైతు తెలుగులోనే మాట్లాడుతాడని మొత్తానికి ఇదొక గెస్ట్ రోల్ అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :