మెగాస్టార్ చిరంజీవి కి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ థాంక్స్..!

Published on Jul 17, 2022 5:14 pm IST


బాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్ స్టార్స్ లో అమీర్ ఖాన్ హీరోగా మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం లాల్ సింగ్ చడ్డా. దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కించిన ఈ చిత్రం హిందీలో విడుదల కి సిద్దం అవుతోంది. ఈ చిత్రం ఫేమస్ బాలీవుడ్ మూవీ అయిన ఫారెస్ట్ గంప్ కి అధికారిక రీమేక్. రీసెంట్ గా అమిర్ ఖాన్ మెగాస్టార్ ఇంట్లో తనకి నాగార్జున, దర్శకులు రాజమౌళి, సుకుమార్ సహా నాగ చైతన్య లకి స్పెషల్ ప్రివ్యూ షో ని వేసి చూపించిన సంగతి తెలిసిందే. ఈ షో కి స్టార్ సెలబ్రిటీ లు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ఇదిలా ఉండగా దీని తర్వాత మెగాస్టార్ తన నుంచి ఒక మెగా అనౌన్సమెంట్ ని అయితే అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ లో లాల్ సింగ్ చడ్డా గా తన సమర్పణలో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుగు పోస్టర్ తో తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో ప్రెజెంట్ చేస్తున్నందుకు ఆనందంగా భావిస్తున్నానని డెఫినెట్ గా ఈ సినిమా ఎమోషనల్ రైడ్ గా మా తెలుగు ఆడియెన్స్ ని మెప్పిస్తుంది, వారు కూడా ఈ సినిమాని అంతే బలంగా ఆదరిస్తారని మెగాస్టార్ తెలియజేసారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు అమీర్ ఖాన్. మాపై చూపుతున్న ప్రేమకి మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఇప్పటికీ ఇంకా నమ్మలేకున్నాము. థాంక్యూ సో మచ్ సర్ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :