సాయి పల్లవికి ఫ్యాన్ అయిపోయాను – అమీర్ ఖాన్

Published on Sep 19, 2021 9:04 pm IST

దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి జంటగా వస్తోన్న సినిమా “లవ్ స్టోరి”. కాగా ఈ సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు.

కాగా ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ… ‘నాగ చైతన్యను లాల్ సింగ్ చద్దా కోసం ఫస్ట్ టైమ్ కలిశాను. ఆయనతో పనిచేస్తుంటే, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. లవ్ స్టోరి సినిమా కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేనూ మీలాగే లవ్ స్టోరి చిత్రాన్ని ఈ నెల 24న చూస్తాను. అదీ థియేటర్ లలోనే. మహారాష్ట్రలో థియేటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. కానీ ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసుకుని చూడాలనుకుంటున్నాను. మొత్తం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. శేఖర్ కమ్ముల మీద ఇక్కడికి వచ్చిన అతిథులు చూపిస్తున్న ప్రేమ నన్ను కదిలిస్తుంది. సాయి పల్లవి పాటలు కొన్ని యూట్యూబ్ లో చూశాను. కానీ ఆమె సినిమాలు నేను ఇంకా చూడలేదు. ఆమె సినిమా పాటలోని ఫస్ట్ క్లిప్ చూసినప్పుడు సాయి పల్లవికి ఫ్యాన్ అయ్యాను. అని సినిమా క్రూకు అమీర్ ఆల్ ద బెస్ట్ చెప్పారు.

సంబంధిత సమాచారం :