ఆకట్టుకుంటున్న అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్ధా” ట్రైలర్!

Published on May 29, 2022 10:25 pm IST


అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో అద్వైత్ చందన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కామెడీ డ్రామా లాల్ సింగ్ చద్దా. ఈ చిత్రం లో కరీనా కపూర్, నాగ చైతన్య లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మరియు వయా కామ్ 18 స్టూడియోస్ పతాకాల పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అమీర్ ఖాన్ తన పాత్రలో జీవించినట్లు ట్రైలర్ చూస్తే అర్దం అవుతుంది. ఒక వ్యక్తి యొక్క లైఫ్ ఎక్స్ట్రా ఆర్డినరీ గా, డిఫెరెంట్ ఏమోషన్స్ తో నిండి ఉన్న చిత్రం గా ఉంది. అయితే ఈ చిత్రం ప్రముఖ హాలీవుడ్ సినిమా అయిన ఫారెస్ట్ గంప్ ఇన్స్పిరేషన్ తో వస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆగస్ట్ 11 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :