రేపు విడుదల కానున్న గోపిచంద్ “ఆరడుగుల బుల్లెట్” ట్రైలర్

Published on Oct 3, 2021 6:37 pm IST

గోపి చంద్ హీరోగా, నయనతార హీరోయిన్ గా బి గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం ఆరడుగుల బుల్లెట్. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రం ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం ను అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ షురూ చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు సినిమా కి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తుండగా, అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.జయ బాలాజీ రియల్ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని తాండ్ర రమేష్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :