కంప్లీట్ ఎంటర్ టైనర్ గా “ఆరడుగల బుల్లెట్” ట్రైలర్!

Published on Oct 4, 2021 1:39 pm IST

గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్ లుగా బీ.గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. జయ బాలాజీ రియల్ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని తాండ్ర రమేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ ఇప్పటికే వేగవంతం చేయడం జరిగింది. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.

కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ట్రైలర్ ఉంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస్ రావు, జయ ప్రకాష్ రెడ్డి, అభిమన్యు సింగ్ లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తుండగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాయడం జరిగింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :