రాధే శ్యామ్ నుండి “ఆషికి ఆ గయి” టీజర్ విడుదల!

Published on Nov 29, 2021 1:39 pm IST

ప్రభాస్ హీరోగా రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ మూవీ రాధే శ్యామ్. టీ సీరిస్ ఫిల్మ్స్ మరియు యూ వీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, ప్రసీద ఉప్పలపాటి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగు లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, మితున్ అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ లు హిందీ వెర్షన్ కి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ఆశిక ఆ గయి అనే పాట కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఈ పాటకి మిథున్ ఆమాల్ లిరిక్స్ అందించి, సంగీతం అందిస్తున్నారు. మిథున్ మరియు అరిజిత్ సింగ్ ఈ పాటను పాడటం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి పాటను డిసెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తెలుగు తో పాటుగా మిగిలిన బాషల్లో ఈ టీజర్ నేడు సాయంత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఆషికి ఆ గయి టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :