హీరోయిన్ పెళ్లిలో ఆ హీరో పాత్రలు కడిగాడు

హీరోయిన్ పెళ్లిలో ఆ హీరో పాత్రలు కడిగాడు

Published on Jun 16, 2024 7:21 PM IST

హిందీలో వచ్చిన ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు నటుడు ఆసిఫ్ ఖాన్. ఐతే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ కుర్ర హీరో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా తన జీవితంలో తాను పడిన సినిమా కష్టాల గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇంతకీ ఆ కష్టాలేమిటో ఆసిఫ్ ఖాన్ మాటల్లోనే విందాం.

ఆసిఫ్ ఖాన్ మాట్లాడుతూ.. అప్పట్లో నాకు ఫుడ్ కూడా లేదు. ఆ సమయంలో బాయ్ గా పనిచేశాను. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ పెళ్లి జరిగిన హోటల్లో పాత్రలు కూడా కడిగాను. ఐతే, నేను నా పని ముగించుకుని, సైఫ్ – కరీనా లతో ఫొటో దిగడానికి వెళ్తే, వారు నిరాకరించారు. ఆ ఘటనే నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చాక బాలీవుడ్ స్టార్ల సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గానూ చేశాను. అదృష్టం బాగుండి, ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ తో హిట్ వచ్చింది’ అంటూ ఆసిఫ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు