సినిమాలు తీయడంలో దర్శకుడు చంద్ర సిద్దార్థాది ప్రత్యేకమైన శైలి. ‘ఆ నలుగురు, అందరి బంధువయా’ వంటి మంచి సినిమాల్ని తీసిన ఆయన ప్రస్తుతం ‘ఆటగదరా శివ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కాగా జూలై 14న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది.
కాగా ఈ నెల 20 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొద్దిరోజుల క్రితమే విదులైన టీజర్, ట్రైలర్లకు కూడ మంచి స్పందన లభించింది. ‘భజరంగీ భాయీజాన్, లింగ’ వంటి భారీ సినిమాల్ని నిర్మించిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వాసుకి వైభవ్ సంగీతాన్ని అందించారు.
