ఓటిటి లో హిందీ ఆడియెన్స్ కి అందుబాటులోకి రానున్న “ఆవేశం”

ఓటిటి లో హిందీ ఆడియెన్స్ కి అందుబాటులోకి రానున్న “ఆవేశం”

Published on Jun 22, 2024 1:05 AM IST

స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ నటించిన ఆవేశం చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. 150 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లు రాబట్టింది. జిత్తు మాధవన్ ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పటికే డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క హిందీ డబ్బింగ్ వెర్షన్ దాని OTT విడుదల తేదీని తాజాగా ప్రకటించడం జరిగింది.

హాట్‌స్టార్ హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం డిజిటల్ హక్కులను పొందింది. ఇది జూన్ 28 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వస్తుంది. ఒరిజినల్ మలయాళ వెర్షన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ వంటి ప్రతిభావంతులైన తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ మధ్య సహకార నిర్మాణం. ప్రముఖ స్వరకర్త సుశిన్ శ్యామ్ సంగీత స్కోర్‌ను రూపొందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు