అయాన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ ప్రారంభం

Aayan-Creations-Muhurtham-p
అయాన్ క్రియేషన్స్ బ్యానర్ పై ‘టిప్పు’ ఫేమ్ సత్యకార్తీక్, సమీర హీరో హీరోయిన్లుగా ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభమైంది. చునియా(సబిహ) స్వీయ దర్శకనిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈరోజు(ఏప్రిల్15) ఉదయం 7 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్ర పూజాకార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, యార్లగడ్డ సుప్రియ, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరయ్యారు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పూజా కార్యక్రమాలను నిర్వహించి స్క్రిప్ట్ అందించారు. ముహర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ నిచ్చారు. అక్కినేని నాగార్జున కెమెరా స్విచ్ఛాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

దర్శక నిర్మాత చునియా(సబిహ) మాట్లాడుతూ ‘’ఇది యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. టిప్పు ట్రైలర్, పోస్టర్స్ ను చూసి సత్యకార్తీక్ ను హీరోగా ఎంచుకున్నాం. కథ అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. సమీర అనే కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్నాం. మరో హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది. ఈ రోజు నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణ స్టార్టవుతుంది. ప్రముఖ యువ సంగీత దర్శకుడు అనూప్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటులు నరేష్, ఇంద్రజ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పలు భారీ సినిమాలకు పనిచేసిన రవీందర్ ఈ సినిమాకు ఆర్ట్ డైరక్టర్ గా పనిచేయడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

సత్యకార్తీక్, సమీర హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నరేష్, ఇంద్రజ, అలీ, కృష్ణుడు, అనితా చౌదరి, విశ్వ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఎడిటింగ్: ధర్మేంద్ర, డైలాగ్స్: కిరణ్ కుమార్, కాస్ట్యూమ్స్: షిర్లే, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా; కన్నా కూనపరెడ్డి, ఆర్ట్; రవీందర్, కథ-నిర్మాత-దర్శకత్వం: చునియా(సబిహ).