ఆడియో రిలీజ్ తేదీని ఖరారు చేసుకున్న ‘అభినేత్రి’

abhinetri-1
ప్రభుదేవా, తమన్నా లు ప్రధాన పాత్ర దారులుగా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘అభినేత్రి’. ఏ . ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ్, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తుండగా, తెలుగులో కోన వెంకట్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్, స్టిల్స్ సినిమాపై మంచి క్రేజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం యొక్క ఆడియో ఈనెల 25న హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో జరగనుంది.

థమన్, జి.వి ప్రకాష్ సంగీతం సంగీతం అందించిన ఈ సినిమాలో సోనూ సూద్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సప్తగిరి, పృథ్వి, షకలక శంకర్ వంటి ప్రముఖ కమెడియన్లు ఇందులో నటిస్తున్నారు. హరర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ రూ. 70 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అక్టోబర్ 7న విడుదల కానుంది.