‘అభినేత్రి’ సినిమాపై పెరుగుతున్న అంచనాలు !

abhinetri
తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘అభినేత్రి’. దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. హర్రర్ కామెడీగా ఉందనున్న ఈ చిత్రంలో తమన్నా ద్విపాత్రాభినయం చేస్తుండగా ప్రభుదేవా, సోను సూద్ లు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రైలర్ రిలీజ్ కు ముందు నుండే టీమ్ రకరకాల ప్రమోషన్లతో సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అలాగే కొద్దిరోజుల క్రితమే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేసింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాని ఫయాన్సీ రేటుకి కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రాన్ని రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదలకానుంది.