ఇంట్రెస్టింగ్ గా దగ్గుబాటి అభిరాం “అహింస” టీజర్..!

Published on Oct 6, 2022 9:06 am IST

టాలీవుడ్ విలక్షణ దర్శకుల్లో ఎంతోమంది యంగ్ హీరోలను టాలీవుడ్ కి పరిచయం చేసి మంచి దారి చూపించిన దర్శకుల్లో దర్శకుడు తేజ కి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇపుడు తేజ ప్రస్తుతం దగ్గుబాటి అభిరాం ని హీరోగా పరిచయం చేస్తూ వస్తున్న తాజా చిత్రమే “అహింస”. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ మరియు వాయిస్ పోస్టర్ లు మంచి ఆదరణను అందుకున్నాయి.

ఇక ఇప్పుడు అయితే మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు. మరి ఇది తేజ మార్క్ లో ఇంట్రెస్టింగ్ విజువల్స్ తో కనిపిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా అభిరాం రోల్ లో తన మార్క్ బాగా కనిపిస్తుంది. అందులోని అమాయకత్వాన్ని అభిరాం తన మొదటి సినిమా అయినా బాగా వ్యక్తపరిచాడు. అలాగే హీరోయిన్ గీతికా కూడా తన లుక్స్ సహా నటనతో ఆకట్టుకుంటుంది.

ఇంకా ఇందులో టైటిల్ కి తగ్గట్టుగా ఉన్న డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా దీనితో పాటుగా తన నాచురల్ యాక్షన్ విజువల్స్ కూడా మంచి ఆసక్తిగా ఉన్నాయి. మొత్తానికి అయితే టీజర్ బాగానే ఉంది ఇక ఇందులో ఆర్ పి పట్నాయక్ సంగీతం,మేకర్స్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మరి రిలీజ్ డేట్ పై అయితే త్వరలోనే అప్డేట్ ఇవ్వనున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :