తెలుగు సినిమాల్లో నటించాలని ఉందంటున్న బాలీవుడ్ హీరో !

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా అభిషేక్ బచ్చన్ హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ, తన తండ్రిలాగా పెద్దగా స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయాడు. అటు హీరోగా కూడా సరైన సక్సెస్ లు లేక సినిమాకి సినిమాకి గ్యాప్ తీసుకుంటున్నాడు. దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ తరువాత, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘మన్మార్జియాన్‌’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.

కాగా ఈ సినిమాలో నటించిన అభిషేక్ కు మంచి పేరు వచ్చింది. చాలా సహజంగా నటించాడని విమర్శకుల నుండి సైతం ప్రత్యేకమైన ప్రశంసలు లభించాయి. తాజాగా అభిషేక్ నిన్న హైదరాబాద్ కి వచ్చాడు. మీడియాతో మాట్లాడారు. మీడియా…తెలుగు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందా అని ప్రశ్నించగా.. నాకు కూడా తెలుగు సినిమాల్లో నటించాలని చాలా ఆసక్తిగా ఉందని అభిషేక్ తెలిపారు.

Exit mobile version