అభిషేక్ బచ్చన్ కొత్త సినిమా కూడా ఓటీటీలోకే !

Published on Mar 14, 2022 8:30 pm IST

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, ఆచార్య ఇలా వరుసగా భారీ సినిమాలు అన్నీ ఇప్పటికే థియేటర్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అలాగే ఇతర భాషల్లో.. ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా బడా హీరోల చిత్రాలన్నీ థియేటర్ రిలీజ్ వైపే అడుగులు వేస్తున్నాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం కొన్ని చిత్రాలు ఉత్సాహ పడుతున్నాయి. కాగా ఆ చిత్రాల్లో
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కొత్త చిత్రం ‘దసావి’ కూడా ఉంది.

కాగా ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సినిమాను జియో స్టూడియోస్ మరియు దినేష్ విజన్ ‘మడాక్ ఫిల్మ్స్’ కలిసి నిర్మించాయి. అందుకే, జియో సినిమా మరియు నెట్‌ఫ్లిక్స్ రెండింటిలోనూ ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ చిత్రంలో అభిషేక్‌తో పాటు నిమ్రత్ కౌర్ మరియు యామీ గౌతమ్ నటించారు. ఆసక్తికరంగా, అభిషేక్ నటిస్తున్న సినిమాలన్నీ ఈ మధ్య ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి

సంబంధిత సమాచారం :