
గత నెలలో రిలీజ్ అయిన గోపించాండ్ జిల్ సినిమా గుర్తుందా.. ఈ సినిమాలో గోపీచంద్ కి తల్లి పాత్రలో నటించిన నటి ఊర్వశి గుర్తుందా.. ఉండే ఉంటుంది ఎందుకంటే తను ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి నటి కాబట్టి, అలాగే తను నేషనల్ అవార్డు గెలుచుకున్న నటి కూడాను. ఇక అసలు విషయంలోకి వెళితే లేటెస్ట్ గా జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్ కి ఊర్వశి తాగేసి వచ్చింది.
తాజాగా ఎల్.డి.ఎఫ్ ఆర్గనైజ్ చేసిన ఫీమేల్ లేగిస్లేటివ్ స్టాఫ్ కమీషన్ మీటింగ్ కి ఊర్వశి హాజరు కావాలి. ఈమె ఈ కార్యక్రమానికి ఆలస్యంగా రావడమే కాకుండా, స్టేజ్ మీదకి కూడా తూగుతూ, తూలుతూ వెళ్ళింది. అంతే కాకుండా స్టేజ్ మీద మాట్లాడడం కూడా సరిగా లేదు. తనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడేసింది. దాంతో ఆ మీటింగ్ కాస్త డిస్టర్బ్ అయ్యింది. ఊర్వశి ఇలా పబ్లిక్ ఈవెంట్ లో మందు తాగి మత్తులో బిహేవ్ చేయడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో తన విడాకుల కేసు హియరింగ్ కి ఎర్నాకులంలోని ఫ్యామిలీ కోర్టుకు తాగి వచ్చింది.