త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఆచార్య!

Published on Oct 2, 2022 6:48 pm IST

మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అవుతోంది. త్వరలో ఆచార్య వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమిని టీవీ లో ప్రసారం కానుంది.

వచ్చే దీపావళి పండుగ కి ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. ఈ చిత్రం లో పాన్ ఇండియా బ్యూటీ పూజా హెగ్డే లేడీ లీడ్ రోల్ లో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :