“ఆచార్య” బిగ్ అప్డేట్ డిలే..కానీ దానికి వర్త్ ఉంటుందట!

Published on Nov 24, 2021 10:58 am IST


టాలీవుడ్ నుంచి వస్తున్న పలు భారీ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తీసిన మెగా మల్టీ స్టారర్ “ఆచార్య” కూడా ఒకటి. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది రిలీజ్ కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

మరి అలాగే ఈరోజు ఈ సినిమాపై చరణ్ చేసిన పవర్ ఫుల్ రోల్ సిద్ధ పై బిగ్ అప్డేట్ ఇస్తారని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు లాస్ట్ మినిట్ లో నిరాశే ఎదురైంది. కానీ మేకర్స్ మాత్రం ఈ ఎదురు చూపులకి తగ్గ ట్రీట్ నే ఇస్తామని చెబుతున్నారు.

అందుకే కాసేపు వెయిట్ చేయాల్సిందిగా కోరారు. మరి ఈ క్రేజీ అప్డేట్ ఏంటో అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More