వైజాగ్, కృష్ణా లో “ఆచార్య” డే 1 వసూళ్ల వివరాలు ఇవే.!

Published on Apr 30, 2022 9:00 am IST

ఎప్పుడు నుంచి టాలీవుడ్ ఆడియెన్స్ మరియు మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు మూడేళ్ళ తర్వాత రిలీజ్ చేశారు. అయితే మంచి హైప్ మధ్యనే వచ్చిన ఈ సినిమా కాస్త మిక్సిడ్ టాక్ ని మాత్రం సంతరించుకుంది. మరి మన టాలీవుడ్ లో టాక్ తో సంబంధం లేకుండా అయితే స్టార్ హీరోల సినిమాలు మంచి రెస్పాన్స్ ని మొదటి రోజు అందుకుంటాయి.

అలాగే ఈ సినిమాకి కూడా డే 1 మంచి ఓపెనింగ్స్ దక్కినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు వైజాగ్ మరియు కృష్ణ జిల్లాలకు సంబంధించి వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. వీటిలో వైజాగ్ లో ఫస్ట్ డే 3.6 కోట్ల షేర్ ని రాబట్టగా కృష్ణా లో 1.9 కోట్ల షేర్ ని ఈ సినిమా అందుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇవి మంచి ఓపెనింగ్స్ అనే చెప్పాలి మరి ఈ వారాంతానికి ఆచార్య పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :