ఆచార్య హిందీ రైట్స్ భారీ ధరకి!

Published on Aug 11, 2021 7:21 pm IST

తెలుగు సినిమాలు బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ నుండి విడుదల అయిన పలు డబ్బింగ్ చిత్రాలకు బాలీవుడ్ లో మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. సినిమా ఫలితాలను ముందుగానే అంచనా వేసి డబ్బింగ్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేయడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సినిమా కి రామ్ చరణ్ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ సైతం ఈ చిత్రం లో సిద్ద పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి మొదటి నుండి భారీ అంచనాలు నెలకొని ఉండటం తో బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంటుంది అని చిత్ర యూనిట్ అంచనా వేసింది. అందుకు తగ్గట్లు గా ప్రముఖ సంస్థ ఈ చిత్రానికి సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ ను 26 కొట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ రానా చిత్రం 23 కోట్ల రూపాయల తో అత్యధికం గా ఉండగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిత్రం టాప్ చైర్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో సోనూ సూద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :