డిజిటల్ ప్రీమియర్ కి మెగాస్టార్ “ఆచార్య” రెడీ!

Published on May 13, 2022 5:49 pm IST

ఆచార్య చిత్రం కోసం తండ్రీ కొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజిటల్‌గా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను పొందిన ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆచార్య తన ప్లాట్‌ఫారమ్‌లో మే 20, 2022 నుండి ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది.

డిజిటల్ ప్రీమియర్ గా రానున్న ఈ ఆచార్య చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. థియేటర్ల లో సినిమా మిస్ అయిన వారు వచ్చే శుక్రవారం నుండి ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ చిత్రానికి సంగీత స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :