మెగాస్టార్ “ఆచార్య” మూవీపై ఫస్ట్ రివ్యూ..!

Published on Apr 26, 2022 11:20 pm IST


మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది.
అయితే ఈ సినిమాపై ప్రముఖ క్రిటిక్, యూఏఈ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు తన తొలి రివ్యూను ఇచ్చేశాడు. సినిమాకు ఏకంగా 4 స్టార్ రేటింగ్ ఇస్తూ చిరంజీవి, రామ్ చరణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆచార్య సినిమా మాస్ ప్రేక్షకులకు పుల్ మసాలా అందించే సినిమా. చిరు, చరణ్ తమ నటనతో ఇరగదీశారని ఉమైర్ చెప్పుకొచ్చాడు. ఈ రివ్యూ చూస్తుంటే ఆచార్య సినిమా ఖచ్చితంగా మెగా అభిమానులకు పుల్ మీల్స్ అందించేలా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇదిలా ఉంటే కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించగా, తనికెళ్ల భరణి, సోనూ సూద్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :