లేటెస్ట్..”ఆచార్య” ఓటిటి డీల్ వారితో క్లోజ్..!

Published on Nov 26, 2021 7:03 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా భారీ బిజినెస్ జరుపుకుని రిలీజ్ కి కూడా ఈ సినిమా రెడీ అవుతోంది.

అయితే థియేట్రికల్ గా భారీ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం అంతే ఫ్యాన్సీ ధరకు ఓటిటి డీల్ క్లోజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఓటిటి డీల్ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారితో జరిగినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ అయ్యిన కొన్ని వారాలకు ఆచార్య ఓటిటి లో రానుంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More