మణిశర్మ మ్యాజిక్..”ఆచార్య” మెలోడీ బీట్ అదిరింది.!

Published on Nov 4, 2021 10:00 am IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకి గాను మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధ పాత్ర పోషిస్తున్న చరణ్ రోల్ కి గాను పుజా హెగ్డే ఫిమేల్ లీడ్ లో నటిస్తుంది.

మరి ఇదిలా ఉండగా ఈ ఇద్దరి మధ్య మోస్ట్ అవైటెడ్ మెలోడీ సాంగ్ నీలాంబరి ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం మణిశర్మ మార్క్ మెలోడీ లో ఉందని చెప్పాలి. క్లీన్ మెలోడీ బీట్ కి చరణ్ గ్రేస్ స్టెప్స్ ఈ సాంగ్ ప్రోమోలో బాగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా టోటల్ సాంగ్ పై కూడా మంచి అంచనాలు రేకెత్తిస్తున్నాయి. ఇక టోటల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ భారీ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :