పవన్ కోసం “ఆచార్య” స్పెషల్ షో.. రివీల్ చేసిన మెగాస్టార్..!

Published on Apr 28, 2022 12:02 am IST


మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా ‘ఆచార్య’ టీంతో దర్శకుడు హరీష్ శంకర్ చిట్ చాట్ జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో హరీష్… చిరు, చరణ్ లతో పాటు కొరటాల శివ నుంచి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు.

అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి “ఆచార్య” సినిమాను ఎప్పుడు చూపించబోతున్నారని హరీశ్ శంకర్ చిరంజీవిని అడగగా త్వరలోనే… దాని కోసం ప్రత్యేకంగా థియేటర్‌ను బుక్ చేశామని, అందరం కలిసి సినిమా చూస్తామని మెగస్టార్ చెప్పుకొచ్చాడు. అయితే ఏ థియేటర్? స్పెషల్ షో ఎక్కడ? అన్న విషయాన్నీ మాత్రం చిరు రివీల్ చేయలేదు.

సంబంధిత సమాచారం :