“ఆచార్య” స్పెషల్ సాంగ్ కి డీసెంట్ రెస్పాన్స్.!

Published on Apr 19, 2022 8:03 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ భారీ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో కాజల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు మణిశర్మ ఇచ్చిన ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తుండగా నిన్ననే భలే భలే బంజారా సాంగ్ ని రిలీజ్ చెయ్యగా దానికి ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇప్పటి వరకు 14 గంటల్లో 38 లక్షలకి పైగా వ్యూస్ రాగా 2 లక్షలకి పైగా లైక్స్ తో ఈ సాంగ్ డీసెంట్ గా దూసుకెళ్తుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కి ఈ సాంగ్ మంచి ట్రీట్ ఇస్తుంది. దీనితో విజువల్ గా పూర్తి సాంగ్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించగా ఈ ఏప్రిల్ 29న భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :