భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న “ఆచార్య” ట్రైలర్.!

Published on Apr 13, 2022 10:03 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ భారీ సినిమా నుంచి మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని నిన్న సాయంత్రం మేకర్స్ రిలీజ్ చేశారు.

మరి మెగాస్టార్ మరియు మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల మెగా బ్లాస్ట్ తో వచ్చిన ఈ మాసివ్ ట్రైలర్ సాలిడ్ రెస్పాన్స్ ని అందుకొని దూసుకెళ్తుంది. ఆల్రెడీ 13 మిలియన్ కి పైగా వ్యూస్ ని క్రాస్ చెయ్యగా అలాగే 7 లక్షలకి పైగా లైక్స్ తో సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది.

అంతేకాకుండా ఇప్పుడు ఈ ట్రైలర్ యూట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ లోకి కూడా వచ్చేసింది. మొత్తానికి అయితే ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పాలి. అలాగే 24 గంటల్లో ఎంత వస్తుందో చూడాలి. మరి ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

ఆచార్య ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :