“ఆచార్య” ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Published on Apr 9, 2022 6:54 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఆచార్య”. ఇందులో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా సిద్ద అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ మోస్ట్ ప్రెస్టేజియస్ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ విషయంలో జోరు పెంచింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఆచార్య’ మూవీ ట్రైలర్‌ విడుదల తేదిని ప్రకటించారు.

ఆచార్య సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్‌ 12న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించి ఒక పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్, రామ్‌ చరణ్‌ సరసన పూజా హెగ్డే నటించింది. ఇక ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :