మెగాస్టార్ తో సెల్ఫీ..”ఆచార్య” టీం సూపర్ కాంటెస్ట్.!

Published on Nov 16, 2021 2:00 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే ఆల్రెడీ ఈ సినిమా నుంచి రెండు పాటలు కూడా వచ్చి మంచి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే లపై తీసిన మెలోడీ బీట్ నీలాంబరి సాంగ్ తో చిత్ర యూనిట్ ఓ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ పెట్టారు.

ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేసిన సిగ్నేచర్ స్టెప్ తో ఎవరైనా చేసి పోస్ట్ చేస్తే మెగాస్టార్ తో సెల్ఫీ తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టుగా కొణిదెల ప్రొడక్షన్ హౌస్ వారు తెలిపారు. మరి టాలెంట్ ఉన్న ఫ్యాన్స్ కానీ ఆడియెన్స్ కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మెగా సెల్ఫీ సంపాదించుకునేది ఎవరో చూడాలి. మరి ఈ సినిమాని మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :