మెగాస్టార్ “ఆచార్య” నుండి మరొక అప్డేట్

Published on Nov 2, 2021 7:00 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద పాత్ర లో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మరియు పూజ హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, ఫస్ట్ సింగిల్ సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి. ఈ చిత్రం నుండి ఇప్పుడు మరొక అప్డేట్ సిద్దం గా ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్ట్ ను చేయడం జరిగింది. వింటేజ్ మణిశర్మ మెలోడీ సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అప్డేట్ ను నేడు ఉదయం 11:07 గంటలకి రివీల్ చేయనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ ఆచార్య చిత్రం ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More