రాబోయే శుక్రవారం ఆ హీరోకి అగ్ని పరీక్ష!

5th, September 2017 - 05:08:55 PM


ఒకప్పుడు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ వాటిలో కానీసం మూడు హిట్లను అందుకుంటూ నిర్మాతల పాలిట మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం అదృష్టాన్ని పరీక్షకుంచుకునే పనిలో ఉన్నారు. అయన చివరి సినిమాలు ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం, సెల్ఫీ రాజా, మామ మంచు అల్లుడు కంచు’ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆయన పాత మూస ధోరణిలోనే కామెడీని నమ్ముకుని సినిమాలు చేస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి.

దీంతో అల్లరి నరేష్ ఈసారి కామెడీని మాత్రమేకాక తనలోని నటనా కోణాన్ని ఆధారంగా చేసుకుని జి. ప్రజీత్ దర్శకత్వంలో ‘మేడ మీద అబ్బాయి’ అనే సినిమా చేశారు. ఈ చిత్రం తనలోని కొత్త కోణాన్ని చూపుతుందని, దీని వలన ఇకపై తనకు రచయితలు కొత్త తరహా కథల్ని, పాత్రల్ని రాస్తారని నమ్మకంగా చెబుతున్నారు. ఆయన నమ్మకం ఈమేరకు నిజమవుతుందో రాబోయే శుక్రవారం రోజున సినిమా విడుదలతో తేలిపోనుంది. చెప్పినట్టే నరేష్ కొత్తదనాన్ని కనుక చూపిస్తే ఆయనకు పూర్వ వైభవం రావొచ్చు. కాబట్టి ఈ అగ్ని పరీక్షలో నరేష్ సత్పలితాన్ని పొందాలని ఆశిద్దాం.