యాక్షన్ ఎపిసోడ్ తో ఎన్.టి.ఆర్ ‘నాన్నకు ప్రేమతో’

Temper-ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని న్యూ ఎనర్జీతో తన తదుపరి సినిమాకి సిద్దమవుతున్నాడు. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సినిమానే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – సుకుమార్ లది. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి, మరోవైపు ఎన్.టి.ఆర్ తన లుక్ ని మార్చుకునే పనిలో ఉన్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ యుకె లో మొదలవుతుందని ఇది వరకే తెలియజేశాం. మే 14 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా మొదటగా ఎన్.టి.ఆర్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారని సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ ని సుకుమార్ చాలా స్టైలిష్ గా షూట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఫాదర్ సెంటిమెంట్ కి పెద్ద పీట వేస్తూ రాసుకున్న ఈ కథకి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఫాదర్ సెంటిమెంట్ తో పాటే ఎన్.టి. ఆర్ అభిమానులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్, సాంగ్స్, లవ్ స్టొరీ కూడా ఉండేలా సుకుమార్ కథని ప్రిపేర్ చేసాడు.

ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనుంటే, రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

Exit mobile version