బాలయ్య సినిమాలో యాక్షన్ కింగ్ అండ్ బోల్డ్ హీరోయిన్ ?

Published on Dec 6, 2021 7:02 am IST

‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. ఇక ప్రస్తుతం గోపిచంద్ బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో సుదీప్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ మాత్రం ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. మరి అర్జున్ ది విలన్ పాత్రనా లేక, మరో ఏదైనా అతిధి పాత్రనా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన స్టార్ హీరోయినే ఉండాలని ప్లాన్ చేసిన గోపీచంద్, శృతి హాసన్ ను బాలకృష్ణ సరసన హీరోయిన్ గా తీసుకున్నాడు. అలాగే బాలయ్య సరసన మరో హీరోయిన్ కూడా నటించనుంది. బోల్డ్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ ను ఒక హీరోయిన్ గా ఈ సినిమాలో తీసుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. గతంలో లక్ష్మీ రాయ్ బాలయ్య సరసన ఓ సినిమాలో నటించింది. ఇక బాలయ్య బాబుకు సరిపోయే కథను గోపీచంద్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా గోపీచంద్ బాలయ్యకు కథ చెప్పాడట. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన అఖండ చిత్రం భారీ కలెక్షన్స్ ను సాధిస్తోంది.

సంబంధిత సమాచారం :