యాక్షన్ ప్యాక్డ్‌గా సుధీర్ బాబు “హంట్” టీజర్

Published on Oct 3, 2022 12:26 pm IST

అర్జున్‌లో ఇద్దరు ఉన్నారు, ఒకరు ఎ మరొకరు బి అనుకుంటే, అర్జున్ ఎ కి తెలిసిన మనుషులు, ఇన్సిడెంట్స్, పర్సనల్ లైఫ్ ఏదీ అర్జున్ బి కి తెలియదు. వేర్వేరు మనుషులు అన్నట్టు. అయితే, అర్జున్ ఎ కి తెలిసిన భాషలు, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ అర్జున్ బి లో ఉన్నాయి. అర్జున్ ఎ గా ఉండటమే అర్జున్‌కు ఇష్టం. అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది హంట్ సినిమాలో చూడాలి.

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా హంట్. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు మేకర్స్.

హంట్ టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంది. సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా, ఎంత ఎఫెక్ట్ అయినా, నన్ను ఎవరూ ఆపలేరు అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత క్యూరియాసిటీ పెంచింది. సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ సైతం ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్లు గా నటిస్తున్న చిత్రమిది. విడుదలైన కొన్ని క్షణాల్లో హంట్ టీజ‌ర్‌కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, జెమినీ సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ వివేక్ అన్నామలై, కాస్ట్యూమ్ డిజైనర్ రాగ రెడ్డి, యాక్షన్ రేనౌడ్ ఫవేరో (యూరోప్), స్టంట్స్ వింగ్ చున్ అంజి, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ అరుల్ విన్సెంట్‌, సంగీతం జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి, నిర్మాత వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం మహేష్ లుగా వ్యవహరిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :