మేజర్ సినిమాలో సర్ప్రైజ్ లు చాలానే ఉన్నాయ్ అంటున్న అడివి శేష్!

Published on Dec 26, 2021 8:48 pm IST

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. ఈ చిత్రం ను తెలుగు మరియు హిందీ భాషల్లో ఏకకాలం లో సోని పిక్చర్స్ ఇండియా, జీ మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ మరియు A + S మూవీస్ పతాకం పై సంయుక్తం గా నిర్మిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం లో ఎన్నో సర్ప్రైజ్ లు ఉంటాయి అని తాజాగా హీరో అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం లో ఎపిక్ లవ్ స్టొరీ ఉందని, అది తెలుసుకొనే విషయం అంటూ చెప్పుకొచ్చారు. వీటి గురించి రాబోయే కొద్ది రోజుల్లో తెలుసుకొనున్నారు అంటూ చెప్పుకొచ్చారు. శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, సాయి మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :