గుండెపోటుతో మృతి చెందిన నటుడు అల్లు రమేష్

allu ramesh
నటుడిగా ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు అల్లు రమేష్. నేడు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తరుణ్ హీరోగా నటించిన చిరుజల్లు తో తన కెరీర్ ప్రారంభించిన రమేష్, వీధి, బ్లేడ్ బాబ్జి, కేరింత, నెపోలియన్ తదితర 50 చిత్రాల్లో నటించారు.

రాజేంద్రప్రసాద్ అనుకోని ప్రయాణం అల్లు రమేష్ నటించగా విడుదలైన ఆఖరి చిత్రం. నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చిన అల్లు రమేష్ స్వస్థలం విశాఖపట్నం. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ కి చెందిన వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version