సార్పట్ట ట్రైలర్ కి భారీ రెస్పాన్స్…అభిమానులతో ముచ్చటించనున్న ఆర్య!

Published on Jul 14, 2021 5:37 pm IST


ఆర్య హీరోగా గా దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్పట్ట. ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ ఇప్పటి వరకూ 4 మిలియన్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ట్రైలర్ కి వస్తున్న భారీ రెస్పాన్స్ చూసి నటుడు ఆర్య సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులతో నేడు సాయంత్రం ఆరు గంటలకు ముచ్చటించనున్నారు.

ట్రైలర్ నచ్చినందుకు సంతోషం గా ఉందని పేర్కొన్నారు. అంతేకాక ఈ రోజు సాయంత్రం ఆరు గంటల కి #askarya హ్యాష్ ట్యాగ్ తో తన తో మాట్లాడవచ్చు అని తెలిపారు. అయితే ఈ చిత్రం డైరక్ట్ ఓటిటి గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ విడియో లో జూలై 22 వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ చిత్రం కోసం ఆర్య చాలా కష్టపడిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యం లో వస్తున్న ఈ చిత్రం తెలుగు భాషలో కూడా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :