ఇంటర్వ్యూ : భరత్ – తెలుగులో “హంట్” సినిమా అందుకే ఓకే చేశాను

ఇంటర్వ్యూ : భరత్ – తెలుగులో “హంట్” సినిమా అందుకే ఓకే చేశాను

Published on Jan 19, 2023 8:11 PM IST

ఈ ఏడాది టాలీవుడ్ కొత్త బాక్సాఫీస్ శుభారంభం అయితే దక్కింది. మరి ఇలా లేటెస్ట్ గా రిలీజ్ కి రాబోతున్న చిత్రాల్లో సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “హంట్” కూడా రాబోతుంది. టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా మహేష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో నటుడు భరత్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. మరి తాను చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో ఓ సినిమా చేయగా తాను లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

 

తెలుగులో చాలా రోజులు తర్వాత వస్తున్నారు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారు?

అవును నా మెయిన్ స్ట్రీమ్ సినిమా వచ్చి తమిళ్ కాబట్టి నేను అక్కడే ఎక్కువ సినిమాలు చేశాను. హీరోగా కూడా అక్కడే ఎక్కువ చేయడంతో గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో మహేష్ గారు స్పైడర్ లో అవకాశం వచ్చినప్పుడు అది మంచి ఛాన్స్ అనిపించింది. ఇక దాని తర్వాత మళ్ళీ ఈ హంట్ సినిమాకి ఎలా చేయాల్సి వచ్చింది అంటే మంచి కథ సుధీర్ కూడా నాకు బాగా తెలుసు, శ్రీకాంత్ గారి నటులు కూడా ఉండడం తో మళ్ళీ నేను చేయడానికి ఈ సినిమా పర్ఫెక్ట్ అనిపించి ఓకే చేశాను.

 

తెలుగు నుంచి హీరోగా ఏమన్నా అవకాశాలు వచ్చాయా?

నిజంగా చెప్పాలి అంటే నాకేమి రాలేదు. కానీ స్పైడర్ చిత్రం తర్వాత హీరోగా రాలేదు కానీ క్యారెక్టర్స్ కి వచ్చాయి కానీ నేను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే అప్పటికే తమిళ్ లో నేను హీరో గా సినిమాలు చేస్తున్నాను. అలా ఏది సెట్ అవ్వలేదు.

 

ఈ చిత్రంలో మీ రోల్ కోసం చెప్పండి

ఈ సినిమాలో మెయిన్ గా మూడు రోల్స్ కనిపిస్తాయి. నేను ఓ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాను సినిమాలో చాలా ప్లాట్ లు కనిపిస్తాయి. ఇందులో అన్ని అంశాలూ ఉంటాయి.

 

ఈ గ్యాప్ లో టాలీవుడ్ కి కోలీవుడ్ కి ఏమన్నా తేడా గమనించారు?

నా వరకు అయితే ఏ భాషలో చేసినా కూడా ఎలాంటి తేడా లేదు. సినిమా సినిమాగానే ఉంటుంది. కానీ నటీనటులు మారుతూ ఉంటారు. అయితే ఈ కొన్నేళ్లలో తెలుగు సినిమా భారీ ఇండస్ట్రీ గా మారింది. ఇవి తప్ప పెద్దగా ఎలాంటివో మార్పులు నాకు అనిపించలేదు.

 

సినిమాలో యాక్షన్ పార్ట్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు ఉన్నారు

అవును సినిమాలో చాలా బాగుంటాయి నా రోల్ ఒకలా ఉంటుంది సుదీర్ రోల్ ఒకలా ఉంటుంది. తన రోల్ అగ్రెసివ్ గా ఉన్నప్పటికీ సినిమాలో యాక్షన్ బ్లాక్ లు పర్ఫెక్ట్ గా ఉంటాయి. హైదరాబాద్, ప్యారిస్ లో ఈ సీన్స్ చేసాము.

 

శ్రీకాంత్ గారి కోసం చెప్పండి

శ్రీకాంత్ గారు మా సీనియర్ ఆఫీసర్ గా చేసారు. ఆయనపై ఎలాంటి యాక్షన్ బ్లాక్ లు ఉండవు కానీ మాకు సినిమాలో సూచనలు సలహాలు ఇచ్చే పై అధికారిగా తాను కనిపిస్తారు.

 

సుధీర్ బాబు తో వర్క్ కోసం చెప్పండి

సుధీర్ ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం అండి, ఎప్పుడూ చాలా సైలెంట్ గా ఉంటాడు. తనతో వర్క్ చాలా బాగుంటుంది. చాలా కష్టపడతాడు తాను ఏం చేస్తున్నాడో తనకి తెలుసు. ఓ వండర్ ఫుల్ పర్సన్ తను.

 

ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుందా

ఈ సినిమా రిలీజ్ అయ్యాక దేవుడి దయ వల్ల ఆడియెన్స్ కి గాని నచ్చి వారు మంచి సక్సెస్ ఇస్తే సీక్వెల్ తప్పకుండా ఉండొచ్చు.

 

ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

ప్రస్తుతం హంట్ రిలీజ్ కోసం చూస్తున్నాను. తమిళ్ లో అయితే లవ్ అనే సినిమా ఉంది. ఇది మళయాళ సినిమాకి రీమేక్ అది కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు