వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి ట్రైలర్ల పై మంచు మనోజ్ కామెంట్స్!

Published on Jan 8, 2023 5:00 pm IST

ఈ సంక్రాంతి కి టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోల సినిమాలు సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ల సినిమా వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహా రెడ్డి. ఈ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఈ చిత్రాల ట్రైలర్స్ చూసిన టాలివుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

వీర సింహా రెడ్డి ట్రైలర్ నచ్చింది అని, నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ ఎనర్జీ అన్ మ్యాచబుల్ అని అన్నారు. సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నా అని అన్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కి బెస్ట్ విషెస్ అని అన్నారు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రం వాల్తేరు వీరయ్య ట్రైలర్ ను చూసి కామెంట్స్ చేశారు. పూనకాలు వైబ్స్ ఆల్ ఓవర్ అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ లను ఒకే స్క్రీన్ పై చూడటం అద్బుతం అని అన్నారు. డైరెక్టర్ బాబీ కి, చిత్ర యూనిట్ కి గుడ్ లక్ తెలిపారు మంచు మనోజ్.

సంబంధిత సమాచారం :