త్వరగా కోలుకోండి చిరు సర్…రక్తదానం చేసిన నవదీప్

Published on Jan 28, 2022 7:28 pm IST

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా వైరస్ భారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కోవిడ్-19 పాజిటివ్ ఉందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు చిరు. మెగాస్టార్ చిరంజీవి కోలుకోవాలని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. తాజాగా హీరో నవదీప్ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ ను షేర్ చేశారు.

త్వరగా కోలుకోండి డియర్ చిరు సర్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక రక్తదానం చేస్తున్న ఒక ఫోటోను షేర్ చేశారు. రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి అని తెలిపారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :